Part-II
దశగ్రీవుడు ,కుంభకర్ణుడు ,విభీషణుడు ,వరములు పొందిన విషయము వారి మాతా మహుడైన సుమాలి కి తెలియవచ్చెను . అంతట అతడు భయము వీడి తన బలసంపంనులైన అనుచరులతో కూడా పాతాళ లోకము వీడి దశాగ్రీవునికడకు చేరి అతనితో ఇట్లనెను " నాయనా దశాగ్రీవా ముల్లోకములలో శ్రేష్టుడైన బ్రహ్మ దేవుని నుండి వారములు పొందితివి . ఇదివరలో మేము శ్రీ హరి కి భయపడి లంక వదలి రసాతలమునకు చేరి అచట తల దాచుకొంటిమి . మా భయము తొలగిపోయినది . వాస్తవమునకు లంక మనది కనుక నీవు నీ సోదరుడు కుబేరుని పై ఇప్పుడు సామ, దానోపాయములచే గాని బాల ప్రయోగము తో గాని దానిని తిరిగి పొందవలెను" అనెను . దశాగ్రీవునికి మొదట ఈ పలుకులు నచ్చక సుమాలి సూచనలను తిరసకరించెను. కొంత కాలము పిదప ప్రహస్తుడను నిశాచరుడు దశాగ్రీవుని ,ఒప్పించి కుబేరుని కి దూతగా వెళ్లి లంకను తిరిగి రాక్షసులకు ఇవ్వమని , లేని చొ యుధమునకు రావలేనని సందేశము నిచ్చెను . అంతటా కుబేరుడు తన తండ్రి అయిన విశ్రవసుని కడకు పోయి " తండ్రి ఈ దశగ్రీవుడు నాకడకు దూతను పంపినాడు పూర్వము రాక్షసుల నివాసము అయిన లంక ను తనకు ఇయ్యవలసినది గా కోరెను ఇప్పుడు నా కర్తవ్యము గూర్చి తెలుపుము "అనెను . అంతట విశ్రవొమహముని 'కుమారా మహాబాహువైన దశగ్రీవుడు నా కడ ఈ విషయము ప్రస్తావించినాడు ఆ దుర్మతి కి నేనేన్తగానో నచ్చచెపితిని మిగులమందలించితిని కూడా కాని వరదాన గర్వితుడైన ఆ దుష్టుడు యుక్తాయుక్తములను ఎరుగక ఇట్లు ప్రవర్తించు చున్నాడు కనుక నీవు లంకను వీడి నీ సహచరులతో కైలాస గిరి పై నివసింపుము " అనెను . అట్లు లంక తిరిగి రాక్షసుల వసమయ్యెను , కుబేరుడు తన పరివారముతో కైలాసగిరి పై ఉన్న అలకాపురి లో నివాసము ఏర్పరుచుకోనేను .
లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తరువాత దశగ్రీవుడు తన సోదరి అయిన 'శూర్పణఖ' కు దానవ రాజైన 'విదుజ్జిహ్వునకు' ఇచ్చి వివాహము చేసెను , తరువాత కుంభకర్ణుడు 'వజ్రజ్వాల' ను వివాహము చేసుకొనెను , ఈమె బలి చక్రవర్తి మనుమరాలు ,శైలూషుడు అను గాంధర్వ రాజు కుమార్తె అయిన 'సరమ' ను విభీషణుడు వివాహము చేసుకొనెను
దశగ్రీవుడు ఒక నాడు వేటకై అరణ్యము లో తిరుగు చుండగా దితి యొక్క కుమారుడైన 'మయుడు' కనపడెను

No comments:
Post a Comment